: మస్తాన్ వలీ నన్ను శారీరకంగా హింసించాడు: మీడియాతో నీతూ అగర్వాల్


ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో అరెస్టైన టాలీవుడ్ హీరోయిన్ నీతూ అగర్వాల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హైదరాబాదు నుంచి బెంగళూరు పారిపోతున్న క్రమంలో నీతూ కర్నూలు జిల్లా ఉలిందకొండ సమీపంలో పోలీసులకు పట్టుబడింది. కొద్దిసేపటి క్రితం కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వెక్కివెక్కి ఏడుస్తూనే నీతూ పలు విషయాలను మీడియాకు వివరించింది. మస్తాన్ వలీ తనను శారీరకంగా హింసించాడని, తనను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని నీతూ తెలిపింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో పాలుపంచుకోవాలని అతడు తనను వేధించాడని కూడా ఆమె పేర్కొంది. అతడి వేధింపులు తట్టుకోలేక అతడికి లొంగిపోయానని, ఆ క్రమంలోనే ఈ రొంపిలోకి దిగాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. మస్తాన్ వలీతో సంబంధాలు ఏర్పడ్డ తర్వాత నీతూ, తన కుటుంబానికి దూరమైంది. తాజాగా ఎర్రచందనం కేసులో నీతూ అరెస్టైన విషయాన్ని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం కర్నూలు చేరుకున్నారు. ఇదిలా ఉంటే, మస్తాన్ వలి అరెస్ట్ కావడం, స్మగ్లింగ్ లో తన ప్రమేయం ఉందని బయటపడటంతో నీతూ పోలీసులకు లొంగిపోవాలని యత్నించిందట. ఈ మేరకు ఆమె మధ్యవర్తుల ద్వారా పోలీసులకు సమాచారం కూడా అందించింది. అయితే లొంగుబాటు యత్నాలు ఫలించకముందే ఆమె బెంగళూరు పారిపోతూ పోలీసులకు పట్టుబడింది.

  • Loading...

More Telugu News