: ఎంట్రీ ట్యాక్స్ ఎఫెక్ట్... కర్నూలులో ‘ధనుంజయ’ ప్రయాణికుల పడిగాపులు
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు ఫుల్ స్టాప్ పడేలా లేదు. నిండా ప్రయాణికులతో నిన్న రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాదు బయలుదేరిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు కర్నూలు రాగానే నిలిచిపోయింది. కారణమేంటని అడిగితే సాంకేతిక లోపమంటూ బస్సు సిబ్బంది బుకాయించారు. దీంతో చేసేది లేక రాత్రంతా కర్నూలు రోడ్లపైనే పడిగాపులు కాసిన ప్రయాణికులు, తెల్లవారగానే బస్సు సిబ్బందిని నిలదీశారు. దీంతో ఎంట్రీ ట్యాక్స్ కారణంగానే బస్సును నిలిపివేసినట్లు తేలింది. ఈ క్రమంలో ట్రావెల్స్ యాజమాన్యాన్ని సంప్రదిస్తే వారి నుంచి స్పందన లభించలేదు. మరోవైపు సదరు బస్సులో నేడు హైదరాబాదులో జరగనున్న పోటీ పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారట. కర్నూలులోనే బస్సు నిలిచిపోవడంతో వారంతా నేటి పరీక్షలకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. దీంతో పరీక్షార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.