: నేపాల్ లోని తెలుగువారందరిని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత నీదే!: సుజనా చౌదరితో చంద్రబాబు
భూకంపంతో కకావికలమైన నేపాల్ లో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే విషయంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలను వేగవంతం చేశాయి. కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేపాల్ లో చిక్కుకున్న తెలుగు ప్రజలను రప్పించే విషయంపై ఇరువురు నేతలు చర్చించారు. నేపాల్ లో చిక్కుకుపోయిన తెలుగు ప్రజలందరినీ సురక్షితంగా ఇళ్లకు చేర్చే బాధ్యతను చంద్రబాబు, సుజనా చౌదరి భుజస్కందాలపై పెట్టారు. ‘‘నేపాల్ లో చిక్కుబడిన తెలుగు వారినందరినీ వారివారి ఇళ్లకు సురక్షితంగా చేర్చే బాధ్యత నీదే. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి’’ అంటూ చంద్రబాబు, సుజనా చౌదరికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుజనా చౌదరి, చంద్రబాబుతో భేటీ ముగిసిన వెంటనే రంగంలోకి దిగారు.