: నేపాల్ ను వీడని భూకంపాలు... 6.6 తీవ్రతతో మరో మూడు భూకంపాలు


ఇప్పటికే పెను భూకంపంతో నేలమట్టమైన నేపాల్ లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతూనే ఉంది. నిన్న మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో జరిగిన భూకంపం నేపాల్ రాజధాని ఖాట్మండూతో పాటు యావత్తు దేశాన్ని అతలాకుతలం చేసింది. తాజాగా నేటి తెల్లవారుజామున మరో మూడు భూకంపాలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత నేటి తెల్లవారుజామున 3 గంటలకు తొలి భూకంపం సంభవించగా, ఆ తర్వాత 5, 6 గంటల సమయంలోనూ మరో రెండు భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలతో నేపాల్ ప్రజలు రాత్రంతా రోడ్లపైనే భయంభయంగా గడిపారు.

  • Loading...

More Telugu News