: జగద్గిరిగుట్టను చుట్టుముట్టిన పోలీసులు... 49 మంది అనుమానితుల అరెస్ట్


హైదరాబాదులో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా రావడం, నిర్దేశిత ప్రాంతాన్ని చుట్టుముట్టడం, అణువణువునూ జల్లెడ పట్టడం, అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల అరెస్ట్ తో పాటు వస్తువులను స్వాధీనం చేసుకోవడమే కార్డన్ అండ్ సెర్చి సోదాల లక్ష్యం. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సైబరాబాదు సంయుక్త కమిషనర్ శశిధర్ రెడ్డి నేతృత్వంలో దాదాపు 400 మంది సాయుధ పోలీసులు నగరంలోని జగద్గిరిగుట్ట పరిధిలోని శ్రీనివాసనగర్, రింగ్ బస్తీలను చుట్టుముట్టారు. ఇంటింటినీ సోదా చేశారు. ఈ సోదాల్లో అనుమానాస్పదంగా కనిపించిన 49 మంది వ్యక్తులను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వీరిలో పది మంది రౌడీషీటర్లున్నట్లు సమాచారం. అంతేకాక ఓ ఆటోతో పాటు 9 బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులకు పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు కూడా దొరికాయి.

  • Loading...

More Telugu News