: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లికాని ప్రసాదులు 6 లక్షల మంది ఉన్నారట!


నిజమేనండోయ్, తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 6 లక్షలకు చేరుకుందట. వీరంతా మూడు పదుల వయసు దాటిన వారే కావడం గమనార్హం. ఇక రెండు పదుల వయసు దాటిన వారి సంఖ్యనూ పరిగణనలోకి తీసుకుంటే వీరి సంఖ్య మరింత ఆందోళన కలిగించే స్థాయికి చేరడం ఖాయమే. వయసు పెరుగుతున్నా, తమ కుమారులు పెళ్లి పీటలు ఎక్కకపోవడంతో పెళ్లికాని ప్రసాదుల తల్లిదండ్రులు కలవరపాటుకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే, ఎప్పుడెప్పుడు పెళ్లవుతుందంటూ పెళ్లికాని ప్రసాదులు ఎదురుచూస్తుంటే, మరోపక్క తమకు కూడా సరైన వయసులో పెళ్లి కావడం లేదని అమ్మాయిలు కూడా తెగ బాధపడిపోతున్నారు. అయితే వీరి సంఖ్య పెళ్లికాని ప్రసాదులతో పోలిస్తే 25 శాతం మేర తక్కువగా ఉంది. పురుషుల సంఖ్యతో పోల్చి చూస్తే యువతుల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా నిలుస్తోంది.

  • Loading...

More Telugu News