: నేపాల్ కు అన్ని విధాలా సాయపడతాం: ప్రణబ్
నేపాల్ ను భారీ భూకంపం కుంగదీయడంపై భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. తీవ్రంగా నష్టపోయిన పొరుగు దేశానికి అన్ని విధాలా సాయపడేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. నేపాల్ కు భారీ ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఇక, భారత్ లో భూకంప బాధితుల సహాయార్థం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాలకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.