: భూకంప బాధితుల కోసం గూగుల్ 'పర్సన్ ఫైండర్'
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ నేపాల్ భూకంపంలో ఆచూకీ గల్లంతైన వ్యక్తులను కనుగొనేందుకు 'పర్సన్ ఫైండర్' పేరిట ఓ యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ లో రెండు బాక్సులుంటాయి. ఓ బాక్సులో 'నేను ఓ వ్యక్తి కోసం వెదుకుతున్నాను' అని ఉంటుంది. మరో బాక్సులో 'నా వద్ద ఓ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఉంది' అని ఉంటుంది. తమవారికోసం వెదుకుతున్న వారు మొదటి బాక్సును క్లిక్ చేసి తమ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఎవరన్నా బాధితుడు గానీ, వ్యక్తి గానీ తన లేక మరెవరి ఆచూకీ గురించైనా కుటుంబ సభ్యులకు, ఇతరులకు తెలియజేయాలని భావిస్తే రెండో బాక్సులో వివరాలు పొందుపరిస్తే సరి. అప్పుడా సమాచారాన్ని, మొదటి బాక్సులో నమోదైన వివరాలతో సరిపోల్చుకోవడం ద్వారా ఈ యాప్ సంబంధితులకు విషయం చేరవేస్తుంది.