: నేపాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన విజయవాడ అమ్మాయి క్షేమం


నేపాల్ లో తీవ్ర భూకంపం సంభవించడంతో, అక్కడున్న భారతీయుల పరిస్థితిపై అందరిలోనూ ఆందోళన నెలకొంది. ముఖ్యంగా, వారి కుటుంబ సభ్యులైతే భీతిల్లిపోతున్నారు. అలాగే, హియాలయ పర్వత సానువుల్లో ట్రెక్కింగ్ చేసేందుకు వెళ్లిన విజయవాడ అమ్మాయి నీలిమ ఆచూకీ పట్ల కూడా ఆమె కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఈ మధ్యాహ్నం ఆమె తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. తాను క్షేమంగానే ఉన్నట్టు తెలిపింది. దీంతో, వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉదయమే తాను ఖాట్మండు నుంచి చిట్వాంగ్ కు వెళ్లిపోయానని నీలిమ వివరించింది.

  • Loading...

More Telugu News