: ఢిల్లీలో మోదీ ఉన్నత స్థాయి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. నేపాల్, భారత్ సరిహద్దుల్లో వచ్చిన భూకంపంపై కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చిస్తున్నారు. నేపాల్ కు తక్షణమే సహాయ సహకారాలు అందించాలని, అక్కడి భారతీయులను సురక్షితంగా తరలించాలని అధికారులను మోదీ ఆదేశించారు. ప్రధానంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన భూప్రకంపనలు, క్షతగాత్రులకు అందించాల్సిన సహాయంపైన మోదీ సమీక్షిస్తున్నారు.