: 688కి చేరుకున్న నేపాల్ భూకంప మృతుల సంఖ్య
నేపాల్ భూకంప మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 688గా లెక్కతేలినట్టు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అందులో దాదాపు 181 మంది రాజధాని ఖాట్మండులోనే మృతి చెందారు. గత 81 సంవత్సరాలలో నేపాల్లో ఇంతటి శక్తిమంతమైన భూకంపం సంభవించడం ఇదే మొదటిసారి. మరోవైపు క్షతగాత్రులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.