: సిమ్మన్స్ హాఫ్ సెంచరీ... ముంబయి సెంచరీ
ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టుకు ఓ మోస్తరు శుభారంభమే దక్కింది. తొలి వికెట్ కు 42 పరుగులు జోడించిన అనంతరం పార్థివ్ పటేల్ (17) వెనుదిరిగాడు. మరో ఓపెనర్ సిమ్మన్స్ (51) హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్లిద్దరినీ స్టెయిన్ పెవిలియన్ చేర్చాడు. రోహిత్ శర్మ 24 పరుగులు చేశాడు. ప్రస్తుతం ముంబయి జట్టు 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. క్రీజులో పొలార్డ్, రాయుడు ఉన్నారు.