: నేపాల్ కు రిలీఫ్ మెటీరియల్ పంపిన భారత్
ఈరోజు సంభవించిన భూకంపంతో కకావికలమైన నేపాల్ కు 4 టన్నుల రిలీఫ్ మెటీరియల్ ను విమానంలో భారత్ పంపింది. సహాయక చర్యల కోసం 40 మందితో ఎన్ డీఆర్ఎఫ్ బృందం కూడా వెళ్లింది. మెడికల్ బృందాలు, వైద్యులను వేరే విమానాల్లో పంపనున్నారు. మరోవైపు నేపాల్ కు సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు.