: ఖాట్మండులో చిక్కుకున్న 25 మంది హైదరాబాద్ వాసులు


నేపాల్ రాజధాని ఖాట్మండులో హైదరాబాదుకు చెందిన 25 మంది చిక్కుకున్నారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లిన వీరు భూకంపం వచ్చిన సమయంలో హోటల్ లో వున్నట్టు తెలుస్తోంది. వీరంతా నగరంలోని మల్కాజిగిరి వినాయక్ నగర్ వాసులు. వారిలో ఒకరైన గౌరి అనే వ్యక్తి మాట్లాడుతూ, భూకంపం సంభవించిన సమయంలో తాను హోటల్ నాలుగో అంతస్తులోని స్నానాల గదిలో ఉన్నానని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తామంతా పరుగులు తీశామని చెప్పాడు. ప్రస్తుతం పశుపతినాథ్ దేవాలయం దగ్గర ఉన్నామని తెలిపాడు. వారంతా ప్రస్తుతం ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తుండగా, మరోవైపు ఇక్కడి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News