: ఏపీ, తెలంగాణలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం లేదు: ఎన్ జీఆర్ ఐ శాస్త్రవేత్త
భారతదేశాన్ని జోన్ ప్రకారం విభజిస్తే దక్షిణ భారతదేశం జోన్ 3, జోన్ 2 కిందకు వస్తుందని ఎన్ జీఆర్ ఐ శాస్త్రవేత్త పూర్ణచంద్రరావు చెప్పారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను తీసుకుంటే ఈ ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. ఇక జోన్ 5 కింద హిమాలయ ప్రాంతాలు, నార్త్ ఇండియా, అండమాన్స్ ఇవన్నీ కూడా వస్తాయని వివరించారు. ఈ ప్రాంతాల్లో అతిపెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉందని ఓ తెలుగు చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పూర్ణచంద్రరావు తెలిపారు. అందుకే భూకంపాలు ఏ ప్రాంతంలో ఎంత స్థాయిలో వస్తాయో తెలుసుకుని కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టుకోవాలని సూచించారు. అంతేగానీ ప్రజలు దాన్ని పట్టించుకోకుండా ఎక్కువగా బిల్డింగ్స్ కట్టడంవల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. బిల్డింగ్స్ కట్టుకోవడంలో కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ బిల్డింగ్ స్టాండెట్స్ ద్వారా కొన్ని నిబంధనలను కూడా విడుదల చేసిందన్నారు. వాటిని అందరూ తెలుసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.