: భూకంపం ఎఫెక్ట్... నిలిచిపోయిన చార్ ధామ్ యాత్ర


నేపాల్ కేంద్రంగా ఉత్తరాదిని వణికించిన భూకంపం దెబ్బకు ముందు జాగ్రత్త చర్యగా చార్ ధామ్ యాత్రను నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. భూకంపం కారణంగా హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉన్న ఉత్తరాఖండ్ లోనూ భారీ నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చార్ ధామ్ యాత్రలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం. కాగా, మరోవైపు నేపాల్ కు భారత్ నుంచి సహాయక బృందాలను పంపిస్తున్నట్టు అధికారులు వివరించారు. మరిన్ని బృందాలను పంపే విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం అధికారులతో సమావేశమై చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News