: భూకంపం ఎఫెక్ట్... వారణాసి నిరసన ప్రదర్శనలో తొక్కిసలాట
భూకంపం తీవ్రత వారణాసిలో నిరసన తెలుపుతున్న వారిలో భయాందోళనలు కలిగించింది. నిరసనకారులు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఢిల్లీలో రైతు ఆత్మహత్య నేపథ్యంలో, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా వారణాసిలో పలు పార్టీలు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. దీంతో నిరసనకారులు కుట్చెరీ సమీపంలో వీధుల్లోకి చేరగా, ఆ సమయంలోనే భూకంపం సంభవించింది. ప్రతిఒక్కరూ తమ కాళ్లకింద భూమి పరుగులు పెడుతున్న అనుభూతి చెంది ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ ఘటనలో పది మందికిపైగా గాయపడ్డట్టు సమాచారం. వారణాసిలో పలు పురాతన ఇళ్లు ఉండడంతో అధికారులు వాటిని ఖాళీ చేయిస్తున్నట్టు తెలిసింది.