: భూకంపంపై ట్విట్టర్ లో స్పందించిన మోదీ
నేపాల్ కేంద్రంగా నాలుగు దేశాల్లో కనిపించిన భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందించారు. భూకంప తీవ్రత గురించి అధికారులను అడిగి సమాచారం తెలుసుకుంటున్నానని ఆయన వివరించారు. ఉత్తర, ఈశాన్య భారతావనిలో భూకంపం ప్రభావం అధికంగా ఉందని ఆయన తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్ లో భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. నేపాల్ లో కూలిన భవంతుల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. వీటి కింద ఎవరైనా చిక్కుకుని ఉన్నారా? అన్న సంగతిపై సమాచారం వెలువడాల్సి వుంది. నేపాల్ లో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టినట్టు సమాచారం.