: ఖాట్మండు విమానాశ్రయం మూసివేత... కొనసాగుతున్న ప్రకంపనలు


నేపాల్ కేంద్రంగా వచ్చిన భూకంపం తరువాత ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. భూ ఉపరితలానికి 11.9 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మరోవైపు పాకిస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. ఖాట్మండులో ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండడంతో విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఖాట్మండులో ల్యాండ్ కావలసిన విమానాలను సమీపంలోని భారత ఎయిర్ పోర్టులకు మళ్లించారు. నేపాల్ లో ఆస్తి నష్టం భారీగానే ఉండవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News