: విరాట్ కోహ్లీ ప్రవర్తనపై బీసీసీఐ నిఘా
యువ క్రికెటర్, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై బీసీసీఐ నిఘా ఉంచినట్టు సమాచారం. అతని ప్రవర్తనను పరిశీలిస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా తెలిపారు. "సరే, అతని (కోహ్లీ ప్రవర్తన)పై పరిశీలన ఉంటుంది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే తప్పకుండా తీసుకుంటాం" అని హిందూస్థాన్ టైమ్స్ ప్రత్యేక ఇంటర్వ్యూలో దాల్మియా వెల్లడించారు. తానిది కావాలని చెప్పడంలేదని, అంతా బాగానే ఉందని కూడా అనడంలేదని అన్నారు. ఒకవేళ కోహ్లీ వైఖరిపై చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందా? అని నిర్ణయించే ముందు తాను కూడా అతనిని పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఇదంత తేలికగా మాట్లాడేది కాదని దాల్మియా పేర్కొన్నారు. ప్రపంచకప్ సమయంలో ఓ విదేశీ జర్నలిస్టుపై నోరు పారేసుకున్న కోహ్లీ, అంతకుముందు దేశీయ ఆటల్లోను, తాజా ఐపీఎల్ ల్లోనూ పలుసార్లు స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే.