: మస్తాన్ బాబు అంత్యక్రియలు పూర్తి


పర్వతారోహకుడిగా గిన్నిస్ రికార్డు స్థాపించిన మల్లి మస్తాన్ బాబు అంత్యక్రియలు నెల్లూరు జిల్లా గాంధీజన సంఘం గ్రామంలో ఈ మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాల మధ్య జరిగాయి. ఆయన పార్థివదేహాన్ని పలువురు మంత్రులు, అధికారులు, నేతలు, అభిమానులు కడసారి చూసి అశ్రునయనాల మధ్య శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసులు మూడుసార్లు గాల్లోకి తుపాకులు పేల్చి నివాళులు అర్పించారు. ఆయన జీవిత కథను పిల్లల పాఠ్యాంశాల్లో చేరుస్తామని, ఆయన పేరిట అవార్డును ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన దేహాన్ని సొంత పొలంలోనే ఖననం చేసిన బంధువులు, ఆయన గుర్తుగా అక్కడే స్మారకచిహ్నాన్ని నిర్మిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News