: భయంతో పరుగులు తీసిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సందర్శకులు


అమెరికా వెళ్లే సందర్శకుల్లో అత్యధికులు సందర్శించే స్మారక కట్టడాల్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒకటన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ బాంబులు పెట్టారని పోలీసులకు ఫోన్ వచ్చింది. ఇదే సమయంలో విషయం అక్కడ కూడా తెలిసింది. దీంతో సందర్శకులు భయంతో పరుగులు పెట్టారు. పోలీసులు వచ్చి మొత్తం దీనిని ఖాళీ చేయించి సోదాలు జరిపితే ఒక మూల గుర్తు తెలియని సంచీ ఒకటి కనిపించింది. దీనిలో కూడా ఎటువంటి పేలుడు పదార్థాలు లేవు. కాగా, ఈ ఘటనతో భయాందోళనలకు గురైన సందర్శకులు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నుంచి మన్ హటన్ తీరం చేరేందుకు ఫెర్రీల కోసం క్యూ కట్టారు. ఈ చిత్రాలను పలువురు తమ ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News