: సునీల్ నరైన్ ను వీడని దురదృష్టం!


కోల్ కతా నైట్ రైడర్స్ తరపున తరపున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ పై మరోసారి అనుమానాలు తలెత్తాయి. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో నరైన్ బౌలింగ్ తీరు పలు ప్రశ్నలు తలెత్తేలా చేసింది. దీంతో నరైన్ ను మరోసారి చెన్నైలోని శ్రీరామచంద్రా ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ కు పంపి పరీక్షలు జరిపించాలని కోల్ కతా భావిస్తోంది. కాగా, గతంలో ఒకసారి నరైన్ కు ఇవే తరహా పరీక్షలు నిర్వహించిన ఐసీసీ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మైదానంలోని ఇద్దరు అంపైర్లు రిచర్డ్, వినీత్ కులకర్ణిలు నరైన్ పై ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News