: కాలేజ్ క్యాంపస్ లో రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబు... నిర్వీర్యం చేసిన సైన్యం


రెండో ప్రపంచయుద్ధ కాలం నాటి 250 కిలోల బరువైన పేలని బాంబు అమెరికాలోని మిడిల్ సెక్స్ కౌంటీ కాలేజీ క్యాంపస్ లో కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వగా, సైనికాధికారులు వచ్చి ఈ బాంబును నిర్వీర్యం చేశారు. సంవత్సరాల తరబడి ఈ పేలని బాంబు ఇక్కడే పడివున్నా ఎవ్వరూ గుర్తించలేకపోవడం గమనార్హం. ఓ కొత్త నిర్మాణం కోసం పనులు జరుగుతుండగా, ఈ బాంబు కనిపించినట్టు తెలిసింది. ఆ వెంటనే దీన్ని సమీపంలోని సైనిక స్థావరానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు.

  • Loading...

More Telugu News