: మోదీకీ బీహార్ సీఎం నితీశ్ కృతజ్ఞతలు


ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ లో రెండు రోజుల కిందట సంభవించిన తుపానుతో 55 మంది చనిపోగా, రైతులు తీవ్రంగా నష్టపోయారు. దానిపై వెంటనే స్పందించిన మోదీ కేంద్రం నుంచి తప్పకుండా సహాయం అందుతుందని నితీశ్ కు ఫోన్ చేసి చెప్పారు. అధైర్యపడవద్దని భరోసా కూడా ఇచ్చారు. ఇందుకుగానూ నితీశ్ మాట్లాడుతూ, "గౌరవనీయులైన ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి వరద విపత్తుతో దెబ్బతిన్న బీహార్ కు సాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా" అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా త్వరగా స్పందించిందని, వారికి తాము కృతజ్ఞత చెప్పాలని వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో నితీశ్ చెప్పారు.

  • Loading...

More Telugu News