: ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఖాళీ స్థల వివాదం... ఆ స్థలం తనదేనంటూ బోర్డుపాతిన ఓ వ్యక్తి
హైదరాబాదు ఎర్రగడ్డ ఆసుపత్రిలోని 11 ఎకరాల ఖాళీ స్థలం తనదేనంటూ మహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి బోర్డు పాతాడు. స్థలాన్ని అమ్మకానికి పెడుతున్నట్టు బోర్డులపై తెలిపాడు. ఇది తెలిసిన తహశీల్దార్ వెంకటేశ్వర్లు ప్రభుత్వ భూమిలో బోర్డు పాతడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో వివాదం చెలరేగడంతో తహశీల్దార్ పై హుస్సేన్ అనుచరులు దాడికి దిగారు. ఈ క్రమంలో సంజీవ్ రెడ్డి నగర్ లో పోలీస్ స్టేషన్ లో హుస్సేన్ పై ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రభుత్వ అధీనంలో ఉన్న 11 ఎకరాల భూమి తమదేనంటూ అమీనాబేగం, మహ్మద్ ఖాసిం అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు కోర్టులో ఉండగానే భూమికి తానే వారసుడినంటూ కబ్జాకు యత్నించిన హుస్సేన్ పై స్థల ఆక్రమణ కేసులు నమోదయ్యాయి.