: గంటల వ్యవధిలో ఏపీకి రూ. 1.30 కోట్ల సరిహద్దు ఆదాయం
శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తున్న తెలంగాణ వాహనాలపై ప్రవేశ పన్నును వసూలు చేయగా, గంటల వ్యవధిలో రూ. 1.30 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని తెలిసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద సరిహద్దులు దాటి లోపలికి వచ్చిన వాహనాల నుంచి అధికారులు పన్ను వసూలు చేశారు. తెల్లవారుఝాము వరకూ 95 బస్సులు, 105 లారీలు పన్ను కట్టి చెక్ పోస్టును దాటాయి. ఖమ్మం జిల్లా తిరువూరు చెక్ పోస్టు వద్ద 30 వాహనాల నుంచి పన్ను వసూలు చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి పన్ను అమల్లోకి రావాల్సి వుండగా, అంతకు గంట ముందే చెక్ పోస్టు సిబ్బంది తెలంగాణ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. కొన్ని చోట్ల డ్రైవర్లు అధికారులతో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.