: అసలేం జరుగుతోంది...?: ఫోర్డ్ ఫౌండేషన్ వ్యవహారంపై ఇండియా వివరణ కోరిన అమెరికా


అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థలు గ్రీన్ పీస్ రిజిస్ట్రేషనును రద్దు చేయడం, ఫోర్డ్ ఫౌండేషన్ నిధులను అడ్డుకుంటున్న వైనంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ చర్యల వల్ల సంఘానికి మేలు చేస్తున్న సంస్థలు కష్టాల్లో పడతాయని వ్యాఖ్యానించిన యూఎస్ అధికార ప్రతినిధి మ్యారీ హాఫ్, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ నియంత్రణ చట్టం వర్తించే సంస్థలపై ఆంక్షలు సరికావని అన్నారు. జాతీయ భద్రతాంశాలు ముడిపడి ఉన్నాయని చెబుతూ, ఈ సంస్థల కార్యకలాపాలను కేంద్రం అడ్డుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News