: తన బలాన్ని అధికంగా ఊహించుకుంటున్న మోదీ సర్కారు: సీఎల్ఎస్ఏ


భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విషయంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తన బలాన్ని అధికంగా అంచనా వేస్తోందని సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది. ఇండియాలో మాంద్యం సాధారణంగా కనిపించే 'వ్యాపార చక్రం' వంటిది కాదని, ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితికి చేరేందుకు మరింత సమయం పడుతుందని, నిదానంగా ముందుకు సాగుతుందని సీఎల్ఎస్ఏ ఎకానమిస్ట్ రాజీవ్ మాలిక్ వ్యాఖ్యానించారు. మోదీ బాధ్యతలు చేపట్టి 11 నెలలైనప్పటికీ, పెట్టుబడుల విషయంలో ముందడుగు పడడం లేదని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, "తగ్గిన ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు భారత్ కు సానుకూల అంశాలే అయినప్పటికీ, బలహీనంగా ఉన్న రుతుపవనాలు వెనక్కు లాగుతున్నాయి" అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News