: చాక్లెట్ల కోసం షాపుకెళ్లిన ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం... పోలీసుల నిర్లక్ష్యం... ముంబైలో సంచలనం


'అమ్మా, నాకు చాక్లెట్లు కావాల'ని ఆడిగిందా చిన్నారి. మూడు రూపాయలిచ్చిన తల్లి రెండు రూపాయలతో పసుపు పొడి కొని, రూపాయితో చాక్లెట్లు తెచ్చుకోమని తల్లి చెప్పింది. పక్కనే ఉన్న తెలిసిన షాపేకదా అని భావించిన తల్లి, ఒంటరిగా పాపను పంపింది. ఉదయం 10:30 గంటలకు బయటకు వెళ్లిన పాప రాత్రి వరకూ ఇంటికి రాలేదు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో రక్తమోడుతూ రోడ్డుపై ఏడుస్తూ రాత్రి పది గంటల సమయంలో కనిపించింది. పోలీసులకు సమాచారం ఇస్తే 10 నిమిషాల్లో వచ్చేంత దూరంలో ఉండి కూడా రాలేదు. తల్లిదండ్రులు పాపను స్టేషన్ కు తీసుకువెళితే, తమ పరిధిలో లేదని వేరే స్టేషన్ కు పంపారు. దీంతో మరో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వారు అక్కడ ఫిర్యాదు చేసి అర్ధరాత్రి 2 గంటల తరువాత పాపను ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన ముంబైలో సంచలనం కలిగించింది. ఆ వెంటనే స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, విధి నిర్వహణలో అలక్ష్యం చూపిన సదరు స్టేషన్ ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాపను చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్తున్న వ్యక్తి ఆ ప్రాంతంలోని సీసీటీవీలో కనిపించాడు. అతడు స్థానికంగా ఉన్న ఒక షాపు యజమానిగా గుర్తించిన పోలీసులు ఆ కామాంధుడి కోసం వేట మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News