: పర్వత పుత్రుడిని కడసారి చూసేందుకు బారులు తీరిన నేతలు, అభిమానులు


ఆండీస్ పర్వత శ్రేణుల్లో మృతి చెందిన మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని కడసారి చూసేందుకు నేతలు, అభిమానులు బారులు తీరారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మస్తాన్ బాబు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మస్తాన్ బాబు భరతమాత ముద్దుబిడ్డని అభివర్ణించారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఏపీ మంత్రి నారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు మస్తాన్ మృతదేహాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. మస్తాన్ బాబు అంత్యక్రియలు నేడు గాంధీజన సంఘంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News