: టీ-సచివాలయంపై తూచ్!... ఎర్రగడ్డ కాదు, సికింద్రాబాద్!


తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి స్థలంలో నిర్మించేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంగీకరించలేదని తెలుస్తోంది. బేగంపేట రన్ వేకు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ స్థలం ఉండడం, వీఐపీల విమానాలు వస్తూ, పోతూ ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో ఆకాశహర్మ్యాలకు అనుమతి ఇవ్వలేమని ఏఏఐ వెల్లడించడంతో, సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్, బైసన్ గ్రౌండ్స్ ప్రాంతాలను తెలంగాణ సర్కారు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మైదానాల విస్తీర్ణం 70 ఎకరాలకు పైగా ఉండడం, ప్రధాన రహదారిపైనే ఉండడంతో ఇవి అనుకూలంగా ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, ఇవి కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉండడంతో అనుమతుల కోసం ఆ శాఖ కార్యదర్శిని ప్రత్యేకంగా కలవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా శివార్లలో సకల సౌకర్యాలతో కూడిన స్థలాన్ని అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News