: తదుపరి చిత్రంతో జైలుకెళ్తానేమో!: కమలహాసన్
ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచేలా, సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసే కమలహాసన్ మరో వివాదాస్పద ప్రాజెక్టును చేపట్టారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను ఎండగడుతూ, 1968లో తమిళనాడులోని 'కిళవెన్‌మణి' అనే గ్రామంలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందని కమల్ తెలిపారు. దీనికి 'ఉళ్లేన్ అయ్యా' (ఉన్నానయ్యా) అని పెట్టాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం తీస్తే తమిళనాట తనను జైలుపాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కమల్ అంటున్నారు. 44 మంది దళితుల ఊచకోతను చూసిన విద్యార్థి కోణంలో చెప్పేలా కథను సిద్ధం చేసుకున్నానని వివరించారు. సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలు పెట్టనున్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.