: భూకంపాన్ని అనుభవిస్తారా?... అయితే, అక్కడికి వెళ్లండి!
ఎప్పుడైనా, ఎక్కడైనా భూకంపం వస్తే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయడం మనకు తెలిసిందే. కానీ, కొంతమందికి భూకంపాన్ని అనుభవిద్దామని కూడా అనిపిస్తుంది కదా? భూకంపం వస్తుంటే రుచికరమైన ఆహార పదార్ధాలు తినాలని అనిపించే వారూ ఉంటారు కదా? అలాంటి వారికోసమే స్పెయిన్ లో పుట్టుకొచ్చింది ‘డిజాస్టర్ కేఫ్’. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే, తీవ్ర భూకంపం వస్తుండగా విందారగిస్తూ అనుభూతి చెందాలనుకునే వారి కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. రెస్టారెంట్ గదిలో రిక్టర్ స్కేల్ పై 7.8 వరకూ తీవ్రత చూపే ప్రకంపనలు వస్తుండగా సిబ్బంది వడ్డిస్తారు. ఇక ప్లేట్లలోని ఆహార పదార్థాలు కింద పడకుండా తినాల్సిన బాధ్యత మాత్రం కస్టమర్లదేనండోయ్. ఈ రెస్టారెంట్ ఇప్పుడు యమా బిజీగా ఉంటోంది. సీట్లు బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ లో తెగ పోటీ ఉందట.