: ఎంఐఎం ఎదుగుతోంది... తస్మాత్ జాగ్రత్త!: శివసేన
మతతత్వ పార్టీ ఎంఐఎం ఒక్కో ఎన్నికల్లో మెల్లిగా సత్తా చాటుతూ, బలాన్ని పెంచుకోవడం ప్రమాదకర పరిణామమని శివసేన పేర్కొంది. ఔరంగాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ చెప్పుకోతగ్గ సీట్లను గెలుచుకున్న నేపథ్యంలో, శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం ఈ అంశంపై పలు వ్యాఖ్యలు చేసింది. ఎంఐఎంకు దళితులు కూడా మద్దతు పలికితే మహారాష్ట్రలో సామాజిక ఐక్యత దెబ్బతినే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ ఫలితాలపై హిందువులు దృష్టి సారించాలని సూచించింది. కాగా, ఔరంగాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి విజయం సాధించగా, ఎంఐఎం పార్టీ 25 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకున్న సంగతి తెలిసిందే.