: దెబ్బకు దెబ్బ... తెలంగాణ వాహనాలపై ఏపీ పన్ను


తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వాహనాలపై ప్రవేశపన్ను విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. వాహన పన్ను కారణంగా ఏపీ ప్రభుత్వానికి నెలకు సుమారు 5 కోట్ల రూపాయల మేరకు ఆదాయం లభిస్తుందని అంచనా. రాష్ట్ర విభజన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఎంట్రీ ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పన్నును ఉపసంహరించుకునేలా తెలంగాణపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, ఫలితం లేకపోవడంతో తెలంగాణ వాహనాలపైనా పన్ను విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీ ప్రైవేట్ బస్ ఆపరేటర్ల సంఘం, లారీ యజమానుల అసోసియేషన్‌ లు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు గ్రానైట్ లారీలు తిరుగుతుండటం, తిరుమల, శ్రీశైలం క్షేత్రాలకు భక్తుల రాకపోకలు అధికంగా ఉన్నందున, కనీసం ప్రవేశ పన్ను ద్వారా నెలకు నాలుగైదు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News