: బెంగళూరు విజయ లక్ష్యం 131
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ సీజన్-8 22వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకి రహానే (18), వాట్సన్ (26) శుభారంభం ఇచ్చారు. శుభారంభాన్ని భారీ స్కోర్లుగా మలచడంలో వారు విఫలమవడంతో స్మిత్ (31), నాయర్ (16) జట్టును గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. బౌలింగ్ తో పాటు, ఫీల్డింగ్ లో కూడా బెంగళూరు ఆటగాళ్లు రాణించడంతో స్వల్ప వ్యవధిలో వారు అవుటయ్యారు. హుడా (1), సంజు శాంసన్ (4) దారుణంగా విఫలమవ్వడంతో క్రీజులోకి వచ్చిన బిన్నీ (20) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతనికి సహచరులు ఫల్క్ నర్ (4), కులకర్ణి (1) నుంచి సహకారమందకపోవడంతో రాజస్థాన్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మోరిస్ (3), తంబే (2) నాటౌట్ గా నిలవడం విశేషం. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 130 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లతో రాణించగా, పటేల్, చాహల్ చెరి రెండు వికెట్లు తీశారు. వారికి అబ్దుల్లా ఒక వికెట్ తీసి సహకారమందించాడు. 131 పరుగుల విజయలక్ష్యంతో బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది.