: దారుణమైన దేశాల్లో నెంబర్ వన్ ఇదే!
ప్రపంచంలోని అత్యంత దారుణమైన దేశాలతో కూడిన జాబితాలను సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ (ఎస్డీఎస్ఎన్) విడుదల చేసింది. ఆయుర్దాయం, స్వేచ్ఛ, అవినీతి స్థాయి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ అధ్యయనం చేసింది. అందులో టోగో దేశం అత్యంత దారుణమైన దేశంగా ప్రథమస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టోగో తర్వాత స్థానాల్లో బురుండి, సిరియా, బెనిన్, రువాండా, ఆఫ్ఘనిస్తాన్, బుర్కినా ఫాసో, ఐవరీకోస్ట్, గినియా, చాద్ దేశాలున్నాయి. ఆయా దేశాల్లో మానవ హక్కుల గురించి ఎంత తక్కువగా చర్చించుకుంటే అంత మంచిదని ఎస్డీఎస్ఎన్ అంటోంది.