: వాటికన్ సిటీకి ఉగ్రముప్పు?


క్రైస్తవులకు పరమ పవిత్రమైన వాటికన్ సిటీని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా లక్ష్యంగా చేసుకుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటలీలో పట్టుబడిన కొంతమంది అనుమానిత ఉగ్రవాదులను విచారించినప్పుడు ఈ విషయం బయటపడింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లలో దాడులకు కుట్రపన్నడంతో పాటు అరెస్టయిన నిందితులు వాటికన్ సిటీని కూడా లక్ష్యం చేసుకున్నారని కాగ్లియారీ చీఫ్ ప్రాసిక్యూటర్ మౌరో మురా తెలిపారు. ఇటలీలో దేశవ్యాప్తంగా చేసిన సోదాల్లో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లందరికీ ఆల్ ఖైదాతో సంబంధాలు ఉన్నట్టు చెప్పారు. అరెస్టైన వారిలో ఓ ఆధ్యాత్మిక గురువు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకొందరు అక్కడి నుంచి పరారైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News