: నేపాల్ లో బాబా రాందేవ్ యోగా ట్రైనింగ్


సుప్రసిద్ధ యోగా గురువు బాబా రాందేవ్ నేపాల్ లో పర్యటిస్తున్నారు. నేపాల్ లోని తుండిఖేల్ లో ఆయన యోగా క్యాంపును ప్రారంభించారు. ఈ క్యాంపులో 20000 మంది పాల్గొంటున్నారు. ఈ క్యాంపు ప్రారంభోత్సవానికి నేపాల్ ఉప ప్రధాని బామ్ దేవ్ గౌతమ్, మంత్రి నారాయణ ప్రకాశ్ సౌద్ హాజరయ్యారు. నేపాల్ లో రాందేవ్ వారం రోజుల పాటు పర్యటిస్తారు. కాగా, క్యాంపు ఐదు రోజులపాటు జరగనుంది. పర్యటనలో భాగంగా ఆయన భాగమతి నదిని శుద్ధి చేసే కార్యక్రమంలోనూ పాల్గొంటారు.

  • Loading...

More Telugu News