: భారత ఆవులకు బదులు విదేశీ ఆవులను వధిస్తారట!


మహారాష్ట్రలో పశు మాంసంపై నిషేధం విధించడంతో అక్కడి మాంసం వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఉపాధి పోవడంతో ఏం చేయాలో తోచక తలలుపట్టుకుంటున్నారు. గోవధపై నిషేధం ఉండడంతో ఇప్పుడు వారు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. భారత ఆవులకు బదులుగా విదేశీ జాతికి చెందిన జెర్సీ ఆవులను మాంసం కోసం వధిస్తామంటూ అందుకు అనుమతి కోరుతున్నారు. దీనిపై ముస్లిం వేదిక ఆలిండియా మిల్లి కౌన్సిల్ స్పందిస్తూ, బీఫ్ పై నిషేధానికి మద్దతిస్తున్నామని, అయితే, ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూపాలని పేర్కొంది. జెర్సీ ఆవులను మాంసం కోసం వధించడం ఓ ఆప్షన్ గా ఈ కౌన్సిల్ సూచించింది. అవి విదేశీ ఆవులని, వాటికి సంబంధించి మతపరమైన సెంటిమెంట్లేవీ లేవని కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ఎంఏ ఖలీద్ అన్నారు.

  • Loading...

More Telugu News