: 'సూపర్ ఓవర్' కు లక్ష్మణ్ మద్దతు
టీమిండియా మాజీ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ సలహాదారు వీవీఎస్ లక్ష్మణ్ 'సూపర్ ఓవర్' కు మద్దతు పలికాడు. టి20 మ్యాచ్ లలో సూపర్ ఓవర్ ఉండాలని, తద్వారా ప్రేక్షకులకు కిక్ లభిస్తుందని చెప్పారు. మ్యాచ్ టై అయినప్పుడు సూపర్ ఓవర్ తో ఫలితం తేల్చుతారన్న సంగతి తెలిసిందే. ముంబయి వాంఖెడే స్టేడియంలో లక్ష్మణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. "సూపర్ ఓవర్ ఉండడం మంచిదే. మ్యాచ్ చివర్లో ఫలితం తేలాలి. అలా కాకుండా, జట్లు పాయింట్లను పంచుకోవడాన్ని మీరు ఇష్టపడతారా? ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఇలాంటివి అవసరం" అని అభిప్రాయపడ్డాడు.