: రహానే అవుట్... రాజస్థాన్ 36/1


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య అహ్మదాబాద్ లో 22వ మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అజింక్యా రహానే, షేన్ వాట్సన్ బ్యాటింగ్ ప్రారంభించారు. 12 బంతులెదుర్కొన్న రహానే ఒక ఫోరు, సిక్స్ సాయంతో 18 పరుగులు చేయగా, 18 బంతులెదుర్కొన్న వాట్సన్ మూడు ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రహానే (308) ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్న రహానేను పటేల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. దీంతో రాజస్థాన్ జట్టు తొలి వికెట్ నష్టానికి 36 పరుగులు సాధించింది.

  • Loading...

More Telugu News