: స్వగ్రామం చేరిన మల్లి మస్తాన్ బాబు మృతదేహం... బరువెక్కిన హృదయాలు


ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా గాంధీ జనసంగం చేరుకుంది. చెన్నై ఎయిర్ పోర్టు నుంచి ఆయన మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకువచ్చారు. మస్తాన్ బాబును విగతజీవుడిలా చూసేసరికి అక్కడివారి గుండెలు బరువెక్కాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మస్తాన్ బాబు చివరి చూపుల కోసం గ్రామవాసులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆయన తల్లిని ఏపీ మంత్రులు నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్ బాబు పరామర్శించారు.

  • Loading...

More Telugu News