: ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని హామీ ఇచ్చారు: పరకాల


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం ప్రతికూల సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఈ అంశంపై స్పందించారు. విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. విభజన చట్టంలోని హామీలను అమలుచేసే బాధ్యత కేంద్రానిదేనని పరకాల స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా హామీల విషయమై కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక లోటు పూడ్చాల్సింది కేంద్రమేనని అన్నారు. కాగా, కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వక సమాధానంపై పరకాల మాట్లాడుతూ... మంత్రి జవాబులో ప్రత్యేక హోదా ఇవ్వబోమన్న అంశం లేదని తెలిపారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలుచేస్తారన్న నమ్మకం ఉందన్నారు. అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News