: జాగ్రత్త గురూ...ఔటర్ పై వేగం తగ్గినా, పెరిగినా, ఫైన్ పడుద్ది!


జాతీయ రహదారిపై వాహనవేగాన్ని సూచిస్తూ కేంద్రం నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఇకపై జాతీయ రహదారులపై వంద కిలోమీటర్ల వేగంతో రయ్ మంటూ దూసుకుపోవచ్చు. గతంలో కార్లు 65 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలనే నిబంధన ఉండేది. దీనిని సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం... డివైడర్ పక్కన మొదటి, రెండు లేన్లలో వెళ్లే వాహనాలు గంటకు 80 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో వెళ్లాలి. 80 కిలోమీటర్లకు తగ్గినా, 120 కిలోమీటర్లకు పెరిగినా స్పీడ్ గన్ పసిగట్టడం ద్వారా చలానా విధిస్తారు. మూడు, నాలుగు లేన్లలో వెళ్లే వాహనాలు గంటకు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. ఇవి గంటకు 40 కిలో మీటర్ల వేగం తగ్గినా, 80 కిలోమీటర్ల కంటే వేగం పెరిగినా చలానా తప్పదు. ఈ నిబంధనలు కుర్రకారును ఉత్తేజపరిచేలా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News