: శేషాచలం ఎన్ కౌంటర్ పై సిట్ ఏర్పాటు
తిరుపతిలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఏర్పాటైంది. ఎన్ఐఏ సౌత్ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ లో ఏపీకి చెందిన అధికారులను నియమిస్తే విచారణ సక్రమంగా జరగదని కేంద్ర హోంసెక్రెటరీకి పలువురు ఫిర్యాదు చేశారు. మరోవైపు అక్రమంగా ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా చిన్నమండెం మండలం కొండమెల దగ్గర రవాణాకు సిద్ధంగా ఉన్న 31 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తుండగా స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.