: ఎస్ఐ ఆత్మహత్యతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే కళా వెంకట్రావు
ఇటీవల ఎస్ఐ వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిపారు. అతనెప్పుడూ తనను కలవలేదని, తానసలు ఎస్ఐను ఎప్పుడూ చూడలేదని మీడియా సమావేశంలో చెప్పారు. అయితే ఎస్ ఐను తాను, తన పీఏ వేధించారంటూ మీడియాలో వచ్చిన వార్తలు బాధాకరమన్నారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు కుటుంబానికి ఎమ్మెల్యే సంతాపం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వంగర పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా పనిచేస్తున్న వీరాంజనేయులు మూడు రోజుల కిందట విశాఖలో రైలు కిందపడి మరణించాడు. అతని వద్ద లభించిన లేఖలో ఏసీబీ డీఎస్పీ రంగరాజు, ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఆయన పీఏ నాయుడు వేధింపులు తట్టుకోలేకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు రాశారు.