: రాంగోపాల్ వర్మ నిజం ఒప్పుకున్నాడు
_9834.jpg)
రాంగోపాల్ వర్మ సినిమాలో కథ తప్ప అన్నీ ఉంటాయని సినీ అభిమానులు వ్యంగ్యంగా చెప్పుకుంటుంటారు. అది నిజమేనని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పాడు. '365 డేస్' సినిమా ఆడియో వేడుకలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ, తన సినిమాల్లో కథ ఉండదని అన్నాడు. సినిమా ప్రారంభించేటప్పుడు ఓ లైన్ అనుకుంటానని, ఆ తరువాత కథ దానంతటదే సెట్ అయిపోతుందని చెప్పాడు. అయితే ఈ 365 డేస్ సినిమా కథ మాత్రం గత 15 ఏళ్లుగా రాస్తున్నానని వెల్లడించాడు. జీవితంలో పలు కోణాలు చూపించేదే 365 డేస్ సినిమా అని రామూ చెప్పాడు. ఈ ఆడియో వేడుకలో రాంగోపాల్ వర్మ తప్ప మిగిలిన వాళ్లంతా పెళ్లి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విశేషం.