: అతి తక్కువ వ్యవధిలో సమాజం నుంచి పెళ్లి మాయమైపోతుంది: పూరీ జగన్నాథ్
అతి తక్కువ వ్యవధిలో సమాజం నుంచి పెళ్లి మాయమైపోతుందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ జోస్యం చెప్పారు. 365 డేస్ సినిమా ఆడియో వేడుకలో పూరీ మాట్లాడుతూ, సమాజంలో తల్లిదండ్రుల కంటే కూడా స్నేహబంధమే విలువైనదని చెప్పారు. అందుకే తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్నేహంగా మెలుగుతున్నారని అంటుంటారని అన్నారు. అందుకే భారతదేశంలో వీలైనంత తొందర్లో పెళ్లి అనే పదం వినపడదని విశ్వాసం వ్యక్తం చేశారు. మనకి ఇష్టమైన స్నేహితులను మనం పెళ్లి చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. చివరికి మనదేశం జమైకా, స్పెయిన్ లా తయారవుతుందో లేదో తెలియదు కానీ భారత్ లో పెళ్లిళ్లు ఉండవని పూరీ తెలిపారు.